'ఐకాన్' అల్లు అర్జున్‌

- April 08, 2019 , by Maagulf
'ఐకాన్' అల్లు అర్జున్‌

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కొత్త సినిమా డేట్ ఫిక్స్ అయ్యింది. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ నటిస్తున్నారు. ఈ సినిమాకు 'ఐకాన్' అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. 'కనబడుటలేదు' అన్నది ఉప శీర్షిక. ఈరోజు బన్నీ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మత దిల్ రాజు ప్రకటించారు.

ఇలాదీవునే ప్రస్తుతం అల్లు అర్జున్‌.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపికచేసినట్లు తెలుస్తోంది. ఇంకా సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com