ఐసిస్ ఉగ్రవాదులకు దెబ్బ మీద దెబ్బ..
- December 30, 2015
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ టెర్రర్ దాడి నాయకుడిని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. అమెరికా విమాన దాడిలో ప్యారిస్ దాడుల అతను మృతి చెందినట్లు పెంటగాన్ ఓ ప్రకటనలు తెలిపింది. అతను సిరియాలో హతమయ్యాడని తెలిపింది. ఇరాక్ నగరం రమాదీ పైన ఇస్లామిక్ స్టేట్ పట్టు కోల్పోయింది. ఇటీవలే దాని మీద అది పట్టుకోల్పోయింది. రమాదీ పైన తమ పట్టు సడలిపోయిందనే విషయాన్ని ఉగ్రవాద సంస్థ ఐసిస్ జీర్ణించుకునే లోపే ఈ రూపంలో మరో దెబ్బ తగిలింది. పదిమంది ఐసిస్ నాయకులను మట్టుపెట్టినట్లు అమెరికా దళాలు ప్రకటించాయి. మృతి చెందిన వారిలో ప్యారిస్ ఘాతుకానికి ఒడిగట్టిన వారు కూడా ఉన్నారని వెల్లడించాయి. రమాదీలో ఇరాక్ ప్రధాని హైదెర్ అల్ అబాదీ తమ జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. తమ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గురువారం దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నామని, వేడుకలు నిర్వహిస్తామన్నారు. తమ తదుపరి లక్ష్యం బాగ్ధాద్కు 400 కి.మీ. దూరంలోని మోసుల్ అని చెప్పారు. ఆ నగరాన్ని సైతం ఐసిస్ చెర నుంచి విడిపిస్తామన్నారు
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









