రమదాన్ పండుగ..సౌదీ యువరాజు తియ్యటి కానుక
- April 11, 2019
రియాద్: రమదాన్ పండుగ సందర్భంగా సౌదీ యువరాజు ఓ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు సమృద్ధిగా పోషకాలు కలిగిన ఖర్జూర పండ్లను బహుమతిగా పంపనున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 6500 టన్నుల ఖర్జూరలను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వారు చెబుతున్నారు. రమదాన్ పండుగ కోసం ఉపవాస దీక్ష చేపట్టేవారికి ఈ పండ్లు ఎంతో ఉపయోగకరమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఖర్జూరలను పంచే కార్యక్రమం దశలవారిగా చేపట్టనున్నారు. మొదటి దశలో 4వేల టన్నుల ఖర్జూరలను 14 దేశాలకు పంపినున్నట్లు అధికారులు తెలిపారు. రెండో దశలో మిగిలిన 2500 టన్నుల ఖర్జూరలను 29 దేశాలకు పంపించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







