రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- April 12, 2019
అజ్మన్:డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సీట్‌బెల్ట్ లేకపోవడం, అప్రమత్తంగా వుండకపోవడం వెరసి ఓ వ్యక్తి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అజ్మన్‌లోని అల్ జోరా ప్రాంతంలోగల అల్ ఇత్తిహాద్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 49 ఏళ్ళ ఈజిప్టియన్ ప్రాణాలు కోల్పోగా, అతని భార్య ఇద్దరు చిన్నారులకు ఈ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి. డ్రైవింగ్ సమయంలో సరైన అటెన్షన్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని అజమ్మన్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సైఫ్ అల్ ఫలాసీ చెప్పారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్, సివిల్ డిఫెన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. గాయపడ్డవారికి తక్షణ సహాయం అందించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలని అల్ ఫలాసి సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







