చారిత్రాత్మక ఘట్టానికి కేంద్రం కానున్న అబుధాబి

- April 16, 2019 , by Maagulf
చారిత్రాత్మక ఘట్టానికి కేంద్రం కానున్న అబుధాబి

యూఏఈ: మరో కొద్ది రోజుల్లో చారిత్రాత్మక ఘట్టానికి అబుధాబి కేంద్రం కానుంది. భారతీయుల నమ్మకాలకు విలువనిస్తూ అబుధాబి రాజు 55,000 Sq.Ft భూమిని మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా భూమిపూజ జరిగిన విషయం తెలిసిందే. కాగా, 700 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యద్భుతమైన హిందూ మందిరాన్ని 'BAPS స్వామినారాయణ్ సంస్థ' నిర్మించేందుకు ముందుకొచ్చింది. అబుధాబి లో నిర్మితమవనున్న హిందూ మందిరానికి April 20న శంకుస్థాపన..ఈ కార్యక్రమం 'BAPS స్వామినారాయణ్ సంస్థ' ఆధ్యాత్మిక గురు శ్రీ శ్రీ మహంత్ స్వామి మహారాజ్ చేతుల మీదుగా జరుగును. ఆ చారిత్రాత్మక రోజున, మందిర ప్రాంగణంలో యజ్ఞులు ప్రత్యేక వేడుకలో పాల్గొంటారు. మరియు యజ్ఞములో పాల్గొనదలచిన వారు [email protected] సంప్రదించవచ్చు..కాగా, April 20, 2PM నుండి ప్రజలకు పునాది రాళ్ళ దర్శనం మరియు పూజ విధి లో పూలు సమర్పించే అవకాశం కలిపిస్తారు. ఈ కార్యక్రమానికి HH Sheikh Abdullah bin Zayed Al Nahyan (UAE Minister of Foreign Affairs ans International Corporation), HH Sheikh Nahyan Mabarak Al Nahyan (UAE Minister of Tolerance), HE Navdeep Suri (Indain Ambassador to UAE and International Social and Spiritual leaders) ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com