శబరిమల పిటిషన్ కి ధీటుగా సుప్రీం లో ముస్లింల పిటిషన్..
- April 16, 2019
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళా ప్రవేశం చేయొచ్చా లేదా అనే అంశంపై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఆ అంశంపై పిటిషన్‌ను పరిశీలించినట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. అన్ని వయసుల మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేయోచ్చంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు ఆధారంగానే తాము మసీదుల్లోకి ముస్లిం మహిళలు వెళ్లవచ్చా అనే అంశాన్ని తేల్చాలని భావిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను మహారాష్ట్రకు చెందిన ఓ జంట వేసింది. మహిళలను మసీదులోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం అక్రమమని పిటిషన్‌లో తెలిపారు. అది రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. దీంతో 14, 15, 21, 25, 29 ఆర్టికల్స్‌ను ఉల్లంఘించినట్లు అవుతుందని కూడా పిటిషన్‌లో తెలిపారు. ఏ మత గురువు కూడా మసీదుకు వెళ్లరాదని అని చెప్పలేదని పిటిషన్‌లో చెప్పారు. స్త్రీ పురుషులను ఖురాన్ వేరువేరుగా చూడలేదన్నారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్







