లారెన్స్‌కి 10 లక్షలు విరాళం అందించిన చిరు
- April 18, 2019
కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక వైపు కళాసేవ చేస్తూనే మరో వైపు ప్రజా సేవ చేస్తున్న లారెన్స్ ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నాడు. లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న లారెన్స్ 150కి పైగా చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. 200 మంది పిల్లలకి ఉచిత విద్యని అందిస్తున్నాడు. కొందరిని తాను దత్తత తీసుకొని వారికి అండగా నిలుస్తున్నాడు. ఇటీవల కేరళ వరద బాధితులకి ఏకంగా కోటి రూపాయాల సహాయార్థం ప్రకటించారు. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుండి ఇదే అత్యధిక విరాళం కావడం కూడా విశేషం. అయితే ఇప్పుడు తన తన ట్రస్ట్ హైదరాబాద్ లో కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు లారెన్స్ .ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి లారెన్స్‌కి తనవంతు సాయంగా 10 లక్షల విరాళాన్ని అందించారు. ఆయన నటించిన తాజా చిత్రం కాంచన 3 పెద్ద విజయం సాధించాలని కూడా చిరు కోరారు. కాంచన 3 చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు తెలుగులో విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..