తైవాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
- April 18, 2019
తైవాన్లో భారీ భూకంపం సంభవించినట్లు తైవాన్ వాతావరణ కేంద్రం తెలిపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైనట్లు వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హుఆలిన్ నగర తూర్పు తీరానికి వాయువ్య దిశలో 10కిలో మీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.
తైవాన్ రాజధాని తైపేలో భూకంపం ధాటికి భవంతులు కదిలాయి. అంతేకాదు భూకంపం ధాటికి కొన్నిచోట్ల కొండచరియలు విరిగి పడినట్లు వీడియోల్లో కనిపించింది. భూకంపం తీవ్రతతో నివాస గృహాల్లో, కార్యాలయాల్లో ఫర్నీచర్ ధ్వసమైందని తైవాన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది.
పసిఫిక్ మహాసముద్రం పరిసరాల్లో ఉన్న తైవాన్ భూకంపాలకు కేంద్రబిందువుగా ఉంటోంది. ఈ ప్రాంతాన్ని రిమ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తారు. తరుచూ ఇక్కడ భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో సంభవించిన భూకంపంలో దాదాపు 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక గతేడాది ఫిబ్రవరిలో హుఆలియన్ నగరంలో సంభవించిన భూకంపంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..