ఒంటిమిట్టలో అంగరంగవైభవంగా కోదండరామస్వామి కల్యాణం

- April 18, 2019 , by Maagulf
ఒంటిమిట్టలో అంగరంగవైభవంగా కోదండరామస్వామి కల్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణం అంగరంగవైభవంగా జరిగింది. పున్నమి వెన్నెల్లో సీతారాముల కల్యాణం చూసేందుకు భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య శుభ ముహూర్తాన సీతమ్మను రాములోరు పరిణయమాడారు.

కల్యాణోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నర్సింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. స్వామి వారికి బాబు పట్టు వస్త్రాలు సమర్పించారు.అయన వెంట టి.టి.డి ఈవో అనిల్ కుమార్ సింఘాల్  మరియు టి.టి.డి జెఈవో లక్ష్మి కాంతం కూడా ఉన్నారు.

టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో కల్యాణ వేదికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. బెంగళూరుకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా అలంకరించారు. ముత్యంతో కూడిన 2 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తులకు అందచేయనున్నారు. కల్యాణోత్సవానికి టీటీడీ, కడప జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

1200 మంది శ్రీవారి సేవకులు, 500 మంది స్కౌట్స్‌ భక్తులకు సేవలందిస్తున్నారు. గతేడాది జరిగిన పొరపాట్లను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించారు. ముఖ్యంగా షెడ్ల నిర్మాణం విషయంలో.. జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేశారు. లక్ష మంది భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.సీతారాముల కల్యాణం వైభోగంగా జరగడంతో  టి.టి.డి జెఈవో లక్ష్మి కాంతం లక్ష్మీకాంతం కృషి ఎంతో ఉందనడంలో అతియోశక్తి లేదు.బి.లక్ష్మీకాంతం ఆధ్వర్యంలో టీటీడీ సమక్షంలో ఘనంగా రాములోరి కల్యాణం నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com