ఆశ్రయం కోసం సౌదీ అరేబియా అక్కాచెళ్లెళ్ల అభ్యర్థన

- April 19, 2019 , by Maagulf
ఆశ్రయం కోసం సౌదీ అరేబియా అక్కాచెళ్లెళ్ల అభ్యర్థన

బ్యాంకాక్‌ : సౌదీ అరేబియాలో మహిళలను బానిసలుగా చూడటాన్ని భరించలేక.. ఆ దేశ యువతి రహాఫ్‌ ముహ మ్మద్‌ అల్‌ఖునన్‌ కొన్ని రోజుల క్రితం థారులాండ్‌ కు పారిపోయింది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఈ విషయం వైరల్‌ కావడంతో యూఎన్‌ శరణార్థి సంస్థ ఆమెకు కెనడాలో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలో సౌదీకి చెందిన ఇద్దరు యువతులు మహా అల్‌సుబే(28), వఫా అల్‌సుబే(25)కూడా ఇదేవిధంగా ఇంటి నుంచి పారిపోయి జార్జియాకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు వారి పాస్‌పోర్టులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన సదరు యువతులు సోషల్‌ మీడియా ద్వారా తమ సమస్యను అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన యూఎన్‌ శరణార్థి సంస్థ.. బాధితులకు రక్షణ కల్పించాల్సిందిగా జార్జియా అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా ఇంతవరకు తమ అధికారులను బాధితులెవరూ కలవలేదని జార్జియా హౌం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోఫో డినారడిజే గురువారం తెలిపారు. ఆశ్రయం కల్పించాల్సిందిగా తమను కోరలేదని, కనీసం సహాయం కోసం కూడా అర్థించలేదని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com