ఆశ్రయం కోసం సౌదీ అరేబియా అక్కాచెళ్లెళ్ల అభ్యర్థన
- April 19, 2019
బ్యాంకాక్ : సౌదీ అరేబియాలో మహిళలను బానిసలుగా చూడటాన్ని భరించలేక.. ఆ దేశ యువతి రహాఫ్ ముహ మ్మద్ అల్‌ఖునన్ కొన్ని రోజుల క్రితం థారులాండ్ కు పారిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ కావడంతో యూఎన్ శరణార్థి సంస్థ ఆమెకు కెనడాలో ఆశ్రయం కల్పించింది. ఈ క్రమంలో సౌదీకి చెందిన ఇద్దరు యువతులు మహా అల్‌సుబే(28), వఫా అల్‌సుబే(25)కూడా ఇదేవిధంగా ఇంటి నుంచి పారిపోయి జార్జియాకు చేరుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పాస్‌పోర్టులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో భయాందోళనకు గురైన సదరు యువతులు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యను అంతర్జాతీయ మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై స్పందించిన యూఎన్ శరణార్థి సంస్థ.. బాధితులకు రక్షణ కల్పించాల్సిందిగా జార్జియా అధికారులకు విజ్ఞప్తి చేసింది. కాగా ఇంతవరకు తమ అధికారులను బాధితులెవరూ కలవలేదని జార్జియా హౌం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోఫో డినారడిజే గురువారం తెలిపారు. ఆశ్రయం కల్పించాల్సిందిగా తమను కోరలేదని, కనీసం సహాయం కోసం కూడా అర్థించలేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







