స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 10వేల ఉద్యోగాలు..

- April 23, 2019 , by Maagulf
స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో 10వేల ఉద్యోగాలు..

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా దాదాపు 10 వేల పోస్టులతో నాన్ టెక్నికల్ పోస్టుల భర్తీకి ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

మొత్తం పోస్టులు: 10,000 అర్హత: పదవతరగతి లేదా తత్సమాన విద్యార్హత పోస్టులు: ప్యూన్, డాప్టరీ, జమదార్, జూనియర్ గెస్టెట్‌నర్ ఆపరేటర్, చౌకీదార్, సఫాయ్‌వాలా, మాలీ (గార్డెనర్) తదితర పోస్టులు. వయసు: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా

పేపర్-1.. 100 మార్కులకు ఉంటుంది. ఇందులో అన్నీ ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ప్రశ్నలు ఉంటాయి. ఇంటిలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ అవేర్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి.

పేపర్-2.. 50 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థి ఎంచుకున్న భాషలో వ్యాసరూప పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న వ్యాసం కానీ ఇంగ్లీష్‌లో లెటర్ కానీ రాయాల్సి ఉంటుంది. పేపర్-1లో పాసైతేనే పేపర్-2 రాయడానికి అర్హులు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 22.04.2019 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25.05.2019 పేపర్-1 పరీక్ష తేదీ: 02.08.2019 – 06.09.2019    పేపర్-2 పరీక్ష తేదీ: 17.11.2019

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com