శ్రీలంక లో పేలుళ్లకు కారణం అదే!
- April 23, 2019
న్యూజిలాండ్‌లోని మసీదుల్లో జరిగిన దాడులకు ప్రతీకారంగానే ఇస్లామిక్ ఉగ్రవాదులు శ్రీలంకలో బాంబు దాడులు జరిపారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. మంగళవారం పార్లమెంట్లో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. క్రైస్ట్‌చర్చ్ దాడులకు ప్రతీకారంగా ఇస్లామిక్ ఉగ్రవాదులు లంకలో పేలుళ్లకు పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ప్రాథమికంగా తేలిందని పేర్కొన్నారు. దేశ రక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నట్లు ఆయన అంగీకరించారు. అన్ని ఉగ్ర సంస్థలను రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. క్రైస్ట్‌చర్చ్‌లోని రెండు మసీదుల్లో జరిగిన ఉన్మాది కాల్పుల్లో 50మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఈస్టర్ పూట జరిగిన వరుస పేలుళ్లలో మృతిచెందిన వారి సంఖ్య 321కి చేరుకున్నది. 38 మంది విదేశీయులు మృతిచెందారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్సైట్లోనూ ప్రతీకార అంశం ఉన్నట్లు విచారణాధికారులు గుర్తించారు. పేలుళ్లలో మృతిచెందిన వారికి సామూహిక ఖననం చేస్తున్నారు. గాయపడినవారిలో 375మంది ఇంకా ఆస్పత్రుల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..