బిగ్ బాస్3 లో ఉదయ భాను
- April 24, 2019
యాంకర్‌గా, నటిగా బుల్లి తెర ప్రేక్షకులకు పరిచమైన పేరు ఉదయభాను. అడపా దడపా సినిమాల్లో నటించేది. ఆ తరువాత పెళ్లై పిల్లలు పుట్టాక కాస్త విరామం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ బుల్లి తెరపై సందడి చేయడానికి భాను రెడీ అయిపోతోంది. బిగ్ బాస్ సీజన్ 3కి వినిపిస్తున్న కంటెస్టెంట్ పేర్ల లిస్టులో భాను పేరు తెరపైకి వచ్చింది. కంటెస్టెంట్లు వీక్‌గా ఉంటే కార్యక్రమం రక్తి కట్టదు. అందుకే ఎంతిచ్చైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ల కోసం వేట ప్రారంభించింది స్టార్ మా.
యాంకర్‌గా, నటిగా, సింగర్‌గా, డాన్సర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని వ్యక్తి ఉదయభాను.. బిగ్ బాస్ షోలో సందడి చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉదయభాను ప్రస్తుతం ఫామ్‌లో లేకపోయినా ప్రేక్షకులు తనని రిసీవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో రోజుకి రూ.2 లక్షలు ఇచ్చి మరీ తీసుకుంటున్నారట షో నిర్వాహకులు. అంటే వందరోజులకు రూ.2 కోట్లు చెల్లించేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. బిగ్ బాస్ సీజన్లో ఇదే అత్యధిక పారితోషికం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి మిగిలిన కంటెస్టెంట్లు కూడా బెట్టు చేస్తారేమో ఉదయభాను భారీ బడ్జెట్ చూసి మాకేం తక్కువ అని.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..