'మహర్షి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు
- April 24, 2019
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు కథానాయకుడిగా 'మహర్షి' రూపొందింది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాను, వచ్చేనెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. వచ్చేనెల 1వ తేదీన హైదరాబాద్ - నెక్లెస్ రోడ్ లోని 'పీపుల్స్ ప్లాజా'లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడం వలన మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. కాలేజ్ స్టూడెంట్ గా .. విదేశాల్లోని ఒక సంస్థకి సీఈవోగా .. రైతుగా ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..