అల్లం టీ వల్ల ఉపయోగాలు
- April 25, 2019చాలా మందికి ఉదయాన్నే వేడి వేడి టీ గొంతులో పడితే గానీ మనసు ఊరుకోదు. ఉత్సాహంగా కూడా పనిచేస్తారు. టీకి అల్లం జోడిస్తే ఆరోగ్యానికి మంచిది కూడా. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ప్రయాణాలలో కడుపు తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం టీ చాలా మంచిది. ముఖ్యంగా మహిళలు పీరియడ్స్ సమయంలో ఎదుర్కొనే సమస్యలకు అల్లం టీ దివ్యాఔషధంగా పనిచేస్తుంది.
అప్పుడు వచ్చే నొప్పి దూరం అవుతుంది. దీనిని రోజూ త్రాగితే మరీ మంచిది. 40 దాటిన వ్యక్తులకు నడుము నొప్పి, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారు కూడా అల్లం టీ తాగవచ్చు. జలుబు, జ్వరం ఉన్నవారు అల్లం టీ త్రాగాలి.
మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతత కోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
* 40 దాటితే నడుము నోప్పి, కీళ్ల నొప్పులు బాధిస్తుంటాయి. అల్లంటీని రోజూ తీసుకుంటే సమస్య చాలా వరకు తగ్గుముఖం పడుతుంది.
* సీజనల్ వ్యాధులకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటి సమస్యలకు అల్లం టీ అద్భుతంగా పనిచేస్తుంది.
* అధిక బరువుని తగ్గించే శక్తి కూడా అల్లంటీకి ఉంది. చెడు కొలెస్ట్రాల్ని దూరం చేసి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారిస్తుంది.
* శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, మానసిక ప్రశాంతతకోసం అల్లంటీని తీసుకుంటే ఉపయోగం ఉంటుంది.
* మెరుగైన రక్తప్రసరణకు అల్లం టీ బాగా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్