స్మార్ట్‌ఫోన్‌పై రూ.9,000 డిస్కౌంట్..
- April 26, 2019
ఈ-కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ సూపర్ వ్యాల్యూ వీక్ పేరుతో డిస్కౌంట్ సేల్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేల్ ఏప్రిల్ 29 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. సేల్‌లో భాగంగా పది రకాల హానర్ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లను డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. హానర్ 9ఎన్‌లో 4 జీబీ ర్యామ్+128 జీబీ మెమరీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.11,999కు, 3 జీబీ ర్యామ్+32 జీబీ మెమరీ వేరియంట్‌ను 8,999కు కొనుగోలు చేయవచ్చు. హానర్ 9 లైట్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.9,999కు కొనవచ్చు.
హానర్ 10 లైట్ 3 జీబీ ర్యామ్+జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.11,999కు సొంతం చేసుకోవచ్చు. ఇందులోనే 4 జీబీ ర్యామ్+64 జీబీ మెమరీ వేరియంట్‌ను రూ.13,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.16,999. హానర్ 9 ఐ ఫోన్ రూ.10,999కు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.19,999. అలాగే రెడ్‌మీ నోట్ 6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ ఎస్8 వంటి వివిధ రకాల ఫోన్లపై ఆఫర్లు పొందవచ్చు. సేల్‌లో భాగంగా ప్లిప్‌కార్ట్ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్‌ని కేవలం రూ.99కే పొందవచ్చు. ఇంకా ఈ సేల్‌లో ఎక్సేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్‌లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







