అమెరికా ప్రయాణం మరింత కఠినం..
- April 27, 2019
అమెరికా ప్రయాణం మరింత కఠినం కానుంది. విజిటింగ్ వీసా మరింత అనేక మార్పులు చేస్తోంది ట్రంప్ సర్కారు. భారతీయులే టార్గెట్‌గా.. అడ్మిషన్ బాండ్స్ ను ప్రవేశపెట్టనుంది. ఇదే జరిగితే.. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, వ్యాపారులు, ముఖ్యంగా భారతీయులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
భారతీయులే టార్గెట్‌గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వీసా చట్టాన్ని కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెరికాను సందర్శించేందుకు వచ్చే టూరిస్టులు, బిజినెస్ పీపుల్, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా ఇబ్బందులకు గురవ్వనున్నారు. విజిటింగ్ వీసాలను అడ్డుకునేందుకు అమెరికా విదేశాంగ శాఖ అడ్మిషన్ బాండ్స్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి వైట్‌హౌస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
గత నవంబర్ నాటికే అమెరికాలో మొత్తం 1.96 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్నారు. వీరి సంఖ్య అమెరికాలో విద్యనభ్యసిస్తున్న మొత్తం విదేశీ విద్యార్థుల్లో.. 18 శాతం కావడం విశేషం. కాగా 2013లో యూకే సైతం విజిటింగ్ వీసాలను కట్టడి చేసేందుకు ఇలాంటి సెక్యూరిటీ బాండ్ల విధానాన్నే ప్రవేశపెట్టింది.
మొత్తం ఆరు దేశాలకు చెందిన పౌరులు యూకేను సందర్శించాలంటే 3వేల పౌండ్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని నిబంధన పెట్టింది. అయితే ఎంపిక చేసిన 6 దేశాల్లో భారత్ కూడా ఉంది. ప్రధానంగా అమెరికాకు వచ్చే బిజినెస్, టూరిస్ట్ ఇతర నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను తగ్గించే దిశగా ట్రంప్ ఈ చర్యలు తీసుకుంటున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







