'కామినేని' ఆస్పత్రిలో మూడు రోజులు ఉచిత వైద్యసేవలు
- April 27, 2019
హైదరాబాద్:కింగ్‌కోఠిలోని కామినేని ఆస్పత్రిలో మూడు రోజుల పాటు ఓపీ సేవల్లో ఎలాంటి రుసుము లేకుండా వైద్యసేవలు అందిస్తున్నామని కామినేని ఆస్పత్రి డైరెక్టర్, సీనియర్ గైనకాలజిస్టు డాక్టర్ వసుంధర కామినేని తెలిపారు. ఆస్పత్రిలో సాయంత్రం వేళల్లో సేవలకు శుక్రవారం ఆమె శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామినేని ఆస్పత్రి పరిసరాల్లో ఉన్న వారికి సాయంత్రం వేళల్లో వైద్యసేవలు అందక ఇబ్బందులు పడుతున్నారని, ఈ విషయాన్ని స్థానికులు, రోగులు తమ దృష్టికి తీసుకు రాగా.. ఈ మేరకు సేవలను ప్రారంభించామన్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు సాయంత్రం 6 గంటల నుంచి 8 వరకు ఈ వైద్యసేవలను రోగులకు అందిస్తామన్నారు. ఇందులో కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, జనరల్ మెడిసిన్స్, జనరల్ సర్జరీ, పిల్లల విభాగాలకు సంబంధించిన వైద్య సేవలందిస్తామని ఆమె వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..