4 గంటల్లో 17 టన్నుల డేట్స్‌ విక్రయం

- April 27, 2019 , by Maagulf
4 గంటల్లో 17 టన్నుల డేట్స్‌ విక్రయం

ఖతార్‌: సౌక్‌ వకిఫ్‌లోని లార్జ్‌ టెంట్‌లో జరుగుతున్న ఎగ్జిబిషన్‌ 3 వేల మందికి పైగా సందర్శకులతో తొలి రోజున కిటకిటలాడిందని మినిస్ట్రీ పేర్కొంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ తాకిడి కన్పించింది. రెండో రోజు కూడా అదే స్థాయిలో సందర్శకులు కన్పించారు. మే 4 వరకు ఈ ఎగ్జిబిషన్‌ కొనసాగుతుంది. ఒమన్‌, కువైట్‌, జోర్డాన్‌, పాలస్తీన్‌, ఇరాన్‌ మరియు నార్త్‌ ఆఫ్రికా ఇతర దేశాల నుంచి పలు రకాలైన డేట్స్‌ ఇక్కడ ప్రధాన ఆకర్షనగా నిలుస్తున్నాయి. 150 లోకల్‌ మరియు ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిటర్స్‌, తొమ్మిది దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్‌ చేస్తున్నారు. కేవలం నాలుగు గంటల్లో 17 టన్నుల డేట్స్‌ విక్రయం జరిగినట్లు నిర్వాహకులు తెలపిఆరు. కాగా, ఖతార్‌ డేట్‌ ప్రొడక్షన్‌ ఈ ఏడాది 29,000 టన్నులకు చేరుకుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com