విడుదలకు రెడీ అయిన 'కొలైగారన్'
- April 27, 2019
'ఎన్ని హత్యలు చేసేందుకైనా రెడీ..' ఇది 'కొలైగారన్' సినిమా ట్రైలర్‌లో విజయ్ ఆంటోని చెప్పే డైలాగు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలను ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆండ్రూ లూయీస్ దర్శకత్వంలో 'కొలైగారన్' చిత్రంలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ పోలీసు అధికారి పాత్ర పోషించారు. ఆషిమా నార్వల్ కథానాయిక. చిత్రాన్ని మే 19 లేదా 24వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ కెరీర్‌లో ఓ అద్భుతమైన పోలీసు అధికారి పాత్ర పోషించా. ఈ కొత్త జట్టుతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. అంతా యువ జట్టు ఇది. అందుకే వేదికపై వచ్చి మాట్లాడుతున్న నటులు, సాంకేతిక కళాకారులంతా 'నేను చిన్నప్పటి నుంచే అర్జున్ సార్‌కి ఫ్యాన్' అని చెబుతున్నారు.
నాకు అంత వయసేం కాలేదు. 'కొలైగారన్' చిత్రం కోసం నేను కూడా వేచి చూస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం కథానాయకుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ నా ప్రతి ఎదుగుదలలోనూ పాత్రికేయులు ఉన్నారు. సంగీత దర్శకుడిగా తొలిప్రయత్నం చేసినప్పుడు నా ప్రత్యేకతను గుర్తించి అభినందించారు.
నటుడిగా ఎదుగుతున్నప్పుడు కూడా నన్ను ఆదరిస్తున్నారు. దర్శకుడు చెప్పినట్లు నటించా. చిత్రం బాగా వచ్చింది. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలని పేర్కొన్నారు.
నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ 'కొలైగారన్' అనుకున్నట్లు శిల్పంగా వచ్చింది. కమర్షియల్‌గా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఆండ్రూ తెరకెక్కించిన విధానం చూసి.. ఇంకో సినిమా తెరకెక్కించే అవకాశాన్ని ఇచ్ఛా త్వరలోనే ఆ సినిమా నటీనటులు, సాంకేతిక కళాకారుల గురించి చెబుతానని పేర్కొన్నారు. ఆండ్రూకు 'కొలైగారన్' రెండో చిత్రం. గతంలో ఆయన 'లీలై' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా అడుగు పెట్టారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







