మీడియా మిత్రులకి నా బహిరంగ ఆహ్వానం - వర్మ
- April 28, 2019
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలపై అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో మే 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్ లో ప్రెస్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రెస్ మీట్ జరగనున్నట్లు చెప్పారు.
అయితే ఆ హోటల్ వారికి ఎవరో వార్నింగ్ ఇవ్వడంతో భయంతో క్యాన్సిల్ చేశారని.. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని వర్మ పేర్కొన్నారు. దీంతో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా అంటూ వర్మ ట్విటర్ లో పోస్ట్ పెట్టాడు.
మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం
''మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం'' అంటూ పోస్ట్ లో రాసుకొచ్చాడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..