పోలీసుల అదుపులో RGV
- April 28, 2019
ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటూ తనడైన శైలిలో దూసుకుపోతుంటారు రామ్ గోపాల్ వర్మ. ఇటీవల ఆయన నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి గాను నందమూరి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేసినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్లో వాయిదా వేశారు. ఈ క్రమంలో కోర్టు ఒకే చెప్పడంతో మే 1వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఈ సినిమా విడుదల చేయనున్నామని ప్రకటించారు వర్మ.
ఈ మేరకు నేడు (ఆదివారం సాయంత్రం) విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో ప్రెస్మీట్ పెట్టాలని నిర్ణయించారు. అయితే హోటల్ యాజమాన్యం అనుమతి నిరాకరించడంతో నడి రోడ్డుపైనే ప్రెస్మీట్ పెడతానంటూ సంచలన ప్రకటన చేశారు.దీంతో అప్రమత్తమైన పోలీసులు వర్మ ప్రకటన మరి శృతిమించిందని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే కారణంగా రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..