ముగిసిన ఫార్మర్స్ మార్కెట్
- April 29, 2019
బహ్రెయిన్:ఏడవ ఎడిషన్ ఫార్మర్ మార్కెట్ బుడైయాలో ముగిసింది. ఐదు నెలలపాటు ఈ మార్కెట్ జరిగింది. రైతులు, తమ వ్యవసాయ భూముల్లో పండించిన వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. ప్రతి వారం పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ ఫార్మర్స్ మార్కెట్‌ని సందర్శించి, వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకుని, వాటిని కొనుగోలు చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపల్ ఎఫైర్స్, అగ్రికల్చర్ అండ్ అర్బన్ ప్లానింగ్‌తో కలిసి నేషనల్ ఇనీషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ ఈ మార్కెట్‌ని నిర్వహించింది. డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ప్రతి యేడాదీ ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 40 మంది వరకు రైతులు ఈ మార్కెట్‌లో పాల్గొన్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్‌తోపాటు ఈసారి ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, రెస్టారెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో రకరకాల ఫెస్టివల్స్‌ని కూడా నిర్వహించడం గమనార్హం. మల్బరీ ఫెస్టివల్ ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్‌లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..