వర్మకు వత్తాసు పలికిన జగన్
- April 29, 2019
లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుదలను ఆపడంతో వర్మకు సపోర్ట్‌గా నిలబడి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి రామ్ గోపాల్ వర్మకు తన మద్దతును ప్రకటించారు. బెజవాడలో ప్రెస్‌మీట్ పెట్టుకోకుండా రామ్ గోపాల్ వర్మను అడ్డుకోవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?" అంటూ జగన్ ట్వీట్ చేశారు.
రామ్‌గోపాల్ వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడానికి ఆయన చేసిన తప్పేంటి? అంటూ జగన్ ప్రశ్నిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తూ చేసిన ట్వీట్‌పై రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. జగన్‌ని అభినందిస్తూ ట్వీట్ చేసిన వర్మ.. ఇన్నేళ్లు వచ్చినా కూడా చంద్రబాబు నిజాన్ని కనపడకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అది జరగదని ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







