యంటీ బెగ్గింగ్‌ లా: 100,000 వరకు జరీమానా

యంటీ బెగ్గింగ్‌ లా: 100,000 వరకు జరీమానా

రమదాన్‌ సందర్భంగా ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? అనే విషయమై అప్రమత్తంగా వుండాల్సిన రెసిడెంట్స్‌, యాంటీ బెగ్గింగ్‌ చట్టం విషయంలోనూ మరింత అప్రమత్తంగా వుండాల్సిందే. గత ఏడాది యూఏఈ, యాంటీ బెగ్గింగ్‌ పెడరల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. బెగ్గింగ్‌ చేస్తూ పట్టుబడితే 5,000 దిర్హామ్‌ల జరీమానా, మూడు నెలల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి రావొచ్చని ఫెడరల్‌ నేషనల్‌ కౌన్సిల్‌ చెబుతోంది. కొత్త చట్టంతో పవిత్ర రమదాన్‌ మాసంలో బెగ్గర్స్‌కి చోటు లేకుండా చేయాలన్నదే లక్ష్యం. బెగ్గర్స్‌ గ్యాంగ్‌ని నిర్వహించేవారికి ఆరు నెలలకు తగ్గకుండా జైలు శిక్ష, అలాగే 100,000 దిర్హామ్‌లకు తగ్గకుండా జరీమానా విధిస్తారు. 

Back to Top