రమదాన్‌: అధికారిక వర్కింగ్‌ అవర్స్‌ని ప్రకటించిన ఖతార్‌

రమదాన్‌: అధికారిక వర్కింగ్‌ అవర్స్‌ని ప్రకటించిన ఖతార్‌

దోహా:పవిత్ర రమదాన్‌ మాసం కోసం పని గంటల్ని అధికారికంగా ఖతార్‌లో ప్రకటించారు. మినిస్టర్‌ ఆఫ్‌ జస్టిస్‌ అండ్‌ యాక్టింగ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ డాక్టర్‌ ఇస్సా బిన్‌ సాద్‌ అల్‌ జఫాలి అల్‌ నౌమి ఈ మేరకు సర్క్యులర్‌ని ప్రకటించారు. మినిస్ట్రీస్‌, గవర్నమెంట్‌ ఏజెన్సీస్‌, పబ్లిక్‌ బాడీస్‌ మరియు ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ సర్క్యులర్‌ జారీ చేశారు. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పని గంటలు వుంటాయని సర్కులర్‌లో పేర్కొన్నారు. సివిల్‌ సర్వెంట్స్‌కి ఈ పని గంటలు వర్తిస్తాయి. 

Back to Top