ఇక దూసుకురావటానికి సిద్దమవుతున్న 'డియర్ కామ్రేడ్'

ఇక దూసుకురావటానికి సిద్దమవుతున్న 'డియర్ కామ్రేడ్'

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'. "ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌" అనేది ఉప శీర్షిక. మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌బెన్‌ సంసంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారు. చిత్రీకరణ పూర్తయినట్టు చిత్రబృందం తెలిపింది. షూటింగ్‌ చివరి రోజున వీడ్కోలు పార్టీ జరుపుకున్నారు. చిత్ర దర్శకుడు భరత్‌ కమ్మ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జస్టిన్‌ ప్రభాకర్‌ సంగీతం అందిస్తున్నారు.

 

Back to Top