ఉగ్రదాడులపై శ్రీలంక కీలక నిర్ణయం
- April 29, 2019
ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరూ ముఖాలు కప్పుకోరాదని అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖానికి ముసుగు ధరించడం ద్వారా తమ ఐడెంటిటీని దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచే ఈ నిబంధన వర్తిస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్న అధ్యక్షుడు ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దాడుల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. చర్చ్ లన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రార్థనల కోసం చర్చ్ లకు వచ్చేందుకు జనాలు భయపడ్డారు. కల్మునై, సమంథురై, చవలకడె ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఎవరూ చర్చ్ లవైపు రావడానికి సాహసించలేదు. మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు అతడి నుంచి ఉగ్ర సాహిత్యం, జర్మన్ తయారీ ఎయిర్‌గన్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







