జోరు మీదున్న అక్షయ్ కుమార్
- April 29, 2019
బాలివుడ్ హీరోలందరిలోనూ ప్రయోగాలు చేయడంలో అక్షయ్ కుమార్ ముందుంటాడు. అలా ఎక్సిపిరిమెంట్స్ చేస్తూనే రెండేళ్లుగా రొటీన్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడుతున్నాడు. సూపర్ స్టార్ బిరుదు కూడా సంపాదించుకున్నాడు. లేటెస్ట్ గా అనురాగ్ సింగ్ డైరెక్షన్ లో అక్షయ్ లీడ్ రోల్ లో వచ్చిన కేసరీ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అంతేకాదు బాలివుడ్ బాక్సాఫీస్ వద్ద కేసరీ 130 కోట్ల వసూళ్లు రాబట్టింది.
బాలివుడ్ సూపర్ స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్న అక్షయ్ కుమార్ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ చేతిలో మిషన్ మంగళ్, గుడ్ న్యూస్, హౌస్ ఫుల్ 4, సూర్యవంశీ, కాంచన రీమేక్ లక్ష్మీతో కలిపి మొత్తం 5 సినిమాలున్నాయి. వీటన్నింటికీ తోడు ఓ యాక్షన్ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. సో ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాదికి కూడా సరిపడా సినిమాలు అక్షయ్ చేతిలో ఉన్నాయి.
ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ 365 రోజులు అక్షయ్ షూటింగ్ స్పాట్ లోనే గడిపేస్తున్నాడు. అందుకే ఇప్పుడు సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాడు. కేసరి సినిమా తర్వాత అక్షయ్ మరో సినిమాకి సైన్ చేయలేదు. డైరెక్టర్స్ కి కూడా ఇప్పట్లో మరో సినిమా చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక 2017 నుంచి ఇప్పటిదాకా అక్షయ్ నటించిన ఆరు సినిమాలు వంద కోట్ల వసూళ్లు సాధించాయి. వందకోట్ల క్లబ్ లో సల్మాన్ ఖాన్ తర్వాతి స్థానం అక్షయ్ కుమార్ దే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..