ఏంటి.. బిగ్‌బాస్ హోస్ట్ నయనతారా!!
- April 30, 2019నటీనటులకి తాము నటించిన సినిమాలకి సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడమే రాదు. మరి అలాంటిది ఓ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారా.. అందునా తెలుగు షోకి మలయాళ నటిని ఎంపిక చేసారా.. అంటే.. వచ్చీ రానీ తెలుగులో మాట్లాడడమే ఫ్యాషన్ అని అంటారు. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా వెలిగిపోతూ, లేడీ హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్న నయన్ టీవీ షో చేయడానికి ఒప్పుకుందన్నదాంట్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. తను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకే దూరంగా ఉండే నయన్ బుల్లితెరపై షో చేయడానికి వస్తుందంటే నిజంగా విశేషమే.
అయితే ఇదంతా పబ్లిసిటీ కోసం ఓ ఛానల్ చేసిన ప్రయత్నమని తెలిసింది. అసలు విషయానికి వస్తే నయనతార నటించిన నోడిగళ్ చిత్రం మే 12న ఆ ఛానల్లో ప్రసారం కానుందట. అందుకోసమే ఇలా ఓ వింత వార్తను సృష్టించి ప్రసారం చేసారు. మరి ఇంతకు ముందు వచ్చిన వార్త బిగ్‌బాస్ 3 సీజన్‌కి అనుష్క హోస్ట్ అని. అందులో కూడా ఎంత నిజముందో.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..