దుబాయ్ లో భారీ లెవెల్ లో స్మగ్గ్లింగ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తి
- April 30, 2019
దుబాయ్:దుబాయ్ ఎయిర్‌పోర్ట్ అధికారులు కంగుతిన్నారు. ఓ వ్యక్తి కడుపు నిండా 80 కండోమ్స్ బయటపడటంతో అవాక్కయ్యారు. తీరా చూస్తే అందులో డ్రగ్స్ నింపినట్లు వెల్లడైంది. ఈజిప్టుకు బయలుదేరేందుకు ఓ 49 ఏళ్ల వ్యక్తి దుబాయ్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే అతడి కదలికలపై అనుమానం రావడంతో అక్కడి అధికారులు నిలువెత్తు స్కానింగ్ చేశారు. దాంతో కడుపులో ఏదో దాచినట్లు అనుమానం కలిగింది. నిలదీస్తే అలాంటిదేమీ లేదని బుకాయించాడు.
సదరు వ్యక్తి ఏదో దాస్తున్నాడని భావించి డాక్టర్ల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. అతడి కడుపులో 80 కండోమ్స్ చూసి షాక్ తిన్నారు. అయితే వాటి నిండా దాదాపు 2 కిలోల 300 గ్రాముల కొకైన్ నింపినట్లు నిందితుడు అంగీకరించాడు. దాంతో పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు.. లక్ష దిరములు అంటే దాదాపు 20 లక్షల రూపాయల జరిమానా విధించింది. అంతేకాదు శిక్షాకాలం పూర్తయిన తర్వాత దుబాయ్ నుంచి బహిష్కరించాలని తీర్పు చెప్పింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..