పేరు మార్చి హిట్ కొట్టిన మెగా మేనల్లుడు
- May 01, 2019వరుస ఫ్లాపులతో విసిగిపోయిన సాయిధరమ్ తేజ్... సాయితేజ్ గా పేరు మార్చుకుని `చిత్రలహరి`లో నటించాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చన ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకెళ్తూ అటు విమర్శకుల ఇటు ప్రేక్షకుల ప్రశంసలందుకుంటోంది. చిత్రలహరి ఇచ్చిన ఉత్సాహంతో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట సాయితేజ్. ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి డైరక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. గతంలో మారుతితో భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నారని సమాచారం అందుతోంది. డిఫరెంట్ సబ్జెక్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను మారుతి తన దైన శైలిలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోంది. అలాగే ఇంకా రెండు ప్రాజెక్ట్స్ కూడా సాయితేజ్ ఒప్పుకున్నాడని సమాచారం. మొత్తానికి పేరు మారడంతో సాయితేజ్ ఫేట్ మారిందంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు