అమెరికా ఆంక్షలకు తలొగ్గేదిలేదంటున్న టర్కీ
- May 06, 2019అంకారా: అమెరికా ఆంక్షలకు తలొగ్గమని టర్కీ ఉపాధ్యక్షుడు ఫ్యుట్ ఆక్టే ఉద్ఘాటించారు.శత్రు దేశాల క్షిపణుల దాడులను అడ్డుకునేందుకు మిత్రదేశమైన రష్యా సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడుతున్నామని అన్నారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుంటే భారీ ఆంక్షలు మోపుతామంటూ అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని ఆక్టే తెలిపారు. అమెరికా ఆంక్షలకు, బెదిరింపులకు టర్కీ తలొగ్గదని ఆయన స్పష్టం చేశారు. టర్కీ, రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను అమెరికా అడ్డుకోలేదని అన్నారు. రష్యా, టర్కీ మధ్య కుదిరిన ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని రద్దు చేసుకోకపోయినట్టయితే ఎఫ్-35 యుద్ధ విమానాలను టర్కీకి అందజేయలేమని అమెరికా రక్షణ మంత్రి పాట్రిక్ షానహాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ