అగ్ని ప్రమాదం: 13 మంది భారతీయులు క్షేమం
- May 08, 2019
షార్జా సివిల్ డిఫెన్స్ ఫైర్ ఫైటర్స్ అత్యంత వేగంగా స్పందించడంతో 13 మంది భారతీయులు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఓ బర్నింగ్ కార్గో ధో ఈ అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఖాలిద్ పోర్ట్ వద్ద షార్జా క్రీక్‌లో ఈ ధో యాంకర్ చేయబడింది. 6000 గ్యాలర్ల డీజిల్, 120 ఎక్స్‌పోర్టెడ్ వెహికిల్స్, 300 వెహికిల్ టైర్స్ ఈ 'ధో'లో వున్నాయి. ఇవన్నీ కాలి బూడిదైపోయినట్లు అధికారులు వెల్లడించారు. షిప్ (ధో) అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. రికార్డు సమయంలో ఫైర్ ఫైటర్స్ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రాణాపాయం సంభవించలేదని షార్జా సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ కల్నల్ సమి అల్ నక్బి చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి. షిప్‌లోకి కార్గోని ఎక్కించే క్రమంలో మంటలు చెలరేగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







