ఒమన్ లో రక్తదాన శిబిరం

- May 09, 2019 , by Maagulf
ఒమన్ లో రక్తదాన శిబిరం

ఒమన్ లో జరిగే రక్తదాన శిబిరం సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్.టి.ఆర్ సేవాస్ఫూర్తిని లక్ష్యంగా ఎన్.టి.ఆర్ ట్రస్ట్ గడిచిన 22 ఏళ్లుగా పేదవారి అభ్యున్నతి కోసం త్రికరణ శుద్ధితో అనేకరకాల  సేవలందిస్తుంది. మానవ సేవయే మాదవ సేవగా భావిస్తూ.. ఒమాన్లో రక్త దాన అవసరాన్ని గుర్తిస్తూ ఎన్.టి.ఆర్ ట్రస్ట్ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. 

ఒమన్ లో చాలామంది సమయానికి రక్తం దొరకక బాధపడుతున్నారు. రక్త దానము వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా వున్నాయి. కావున అందరూ విచ్చేసి స్వచ్చందముగా రక్త దానము చేయవలసిందిగా ప్రార్ధన. రక్త దానం చేయండి! ప్రాణ దాతలుగా నిలవండి! ఒమన్ లో రక్తదాన శిబిరం ఈవిషయమును మీ బందు మిత్రులకు అందరికి తెలియజేసి కర్మ మరియూ జన్మభూముల లో సేవలు చేసే భాగ్యం కలుగచేసి ఇప్పటి వరకు మీరు అందరూ ఇఛ్చిన సహకారముతో రెండు సార్లు అజేయముగా రక్త దానం చేయయడము జరిగింది అదేవిధముగా ఇప్పుడు కూడా మనము అందరము  సహకారం అందించి ఈ కార్యకరమును జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము. 

వేదిక - బౌషర్ బ్లడ్ బ్యాంకు, మస్కట్, సుల్తానేట్ అఫ్ ఒమాన్ తేదీ - మే 10 , 2019 - శుక్రవారం 
సమయం - ఉదయం 8 గం. నుండి మధ్యాహ్నం 2 గం. వరకు
 సంప్రదించవలసిన నెంబర్లు - 93013805 / 98145922 / 98262636 / 99207436

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com