షార్జా మ్యూజిక్ ఫెస్టివల్ వచ్చేస్తోంది
- January 01, 2016
సార్జా మ్యూజిక్ ఫెస్టివల్ వచ్చేస్తోంది. మూడవ షార్జా వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ 2016 జనవరి 7 నుంచి 12 వరకు షార్జాలోని టూరిస్ట్ డెస్టినేషన్లలో సందడి చేయనుంది. షార్జా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ సహకారంతో ఫరాత్ ఖద్దౌరి మ్యూజిక్ సెంటర్ నిర్వహించనున్న ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌లో 13 దేశాలకు చెందిన అద్భుత ప్రదర్శనలు అలరించనున్నాయి. ఆరు రోజులపాటు జరిగే ఔట్ డోర్ ప్రదర్శనల కోసం షార్జా సిద్ధమైంది. షార్జా మ్యూజిక్ ఫెస్టివల్ మేనేజర్ షరాత్ కద్దౌరి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు బ్యాండ్స్‌ను షార్జాకి తొలిసారిగా తీసుకొస్తున్నందుకు చాలా ఆనందంగా వుందని చెప్పారు. ఆహూతుల్ని ఈ మ్యూజిక్ ఫెస్టివల్ విశేషంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ప్రపంచ ఫ్రఖ్యాత కళాకారులతో ప్రదర్శనలుంటాయని ఆయన అన్నారు. షార్జా వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్ తొలి సీజన్ 2014లో ప్రారంభమయ్యింది. అక్కడినుంచి ప్రతిసారీ ఇంకా ఇంకా కొత్తగా, ఇంకా ఘనంగా షార్జా మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించబడ్తోంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









