ETCA మరియు తెలంగాణ జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్
- May 11, 2019
దుబాయ్:ETCA మరియు తెలంగాణ జాగృతి యూఏఈ ఆధ్వర్యంలో ఇమాజిన్ ఈవెంట్స్ సహకారంతో లీగల్ కన్సల్టెంట్ శాలెం బాబు చే లీగల్ అవేర్నెస్ కార్యక్రమము మరియు పవిత్ర రమదాన్ 30 రోజుల ఉపవాస దీక్షలో భాగమైన 5 వ రోజు ETCA అధ్యక్ష్యులు రాధారపు సత్యం మన ముస్లిం సోదరులకు, శ్రేయోభిలాషులకు ఇఫ్తార్ విందును ఇవ్వడం జరిగింది.
లీగల్ కన్సల్టెంట్ శాలెం బాబు ఇచ్చినటువంటి అమూల్యమైన న్యాయ సలహాలను, సమాచారాన్ని ముఖ్యంగా మంచి పని కోసం వారు వెచ్చించిన విలువైన సమయాన్ని అభినందిస్తూ సభ్యులు, హాజరయిన వారు వారికి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరు అయిన ETCA ప్రెసిడెంట్ సత్యం ముందుగా రమదాన్ కరీం శుభాకంక్షలు తెలియచేసారు, భవిష్యత్ కాలంలో సంఘాన్ని మరింత పటిష్టపరుస్తూ ఇమాజిన్ ఈవెంట్స్ సహకారంతో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులకు మన వారికి ఉపయోగపడేలా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తునట్టు తెలిపారు , ఏప్రిల్ 19 వ తేదీన గుండెపోటు తో మరణించిన నిర్మల్ జిల్లా, లక్ష్మణచాంద మండలము, కన్కపూర్ గ్రామానికి చెందిన నాగన్న మృతదేహాన్ని స్వదేశానికి పంపడానికి పనిచేసిన, కో-ఆర్డినేట్ చేసిన సభ్యులు రాజ శేఖర్ తోట, నరేష్ కుమార్ మాన్యం, అరవింద్ బాబు, భరత్ లను అభినందించారు.
రమదాన్ మాసం ప్రారంభం అయిన నుండి ఇఫ్తార్ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అరవింద్ బాబు,అరవింద్ బొడ్ల,ఇమాజిన్ ఈవెంట్స్ నిర్వాహకులను సభ్యులు అభినందించారు.
కార్యక్రమానికి హాజరు అయిన మా గల్ఫ్ నిర్వాహకులు,TV5 చీఫ్ కోఆర్డినేటర్ శ్రీకాంత్ చిత్తరువు ETCA చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు, అందరికి రమదాన్ మాస శుభాకంక్షలు తెలియచేసారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి యూఏఈ శాఖ అధ్యక్షుడు సాయి చందర్ కటకం పాటు పలువురు ETCA,జాగృతి సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి