గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన 'దుబాయ్ ఫ్రేమ్'
- May 11, 2019దుబాయ్‌లో ప్రముఖ ఎట్రాక్షన్స్‌లో ఒకటైన దుబాయ్ ఫ్రేమ్, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. 'పిక్చర్ ఫ్రేమ్‌లో అతి పెద్ద బిల్డింగ్'గా రికార్డు సొంతం చేసుకుంది. 150.24 మీటర్ల ఎత్తుతో ఈ ఘనతను సాధించింది దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. స్పెక్టాక్యులర్ పనోరమిక్ వ్యూస్ ఈ నిర్మాణం ప్రత్యేకత. దుబాయ్ పాస్ట్, ప్రెజెంట్ మరియు ఫ్యూచర్‌ని ప్రతిబింబించేలా ఈ భవనం నుంచి వ్యూ వుంటుంది. దుబాయ్ ఫ్రేమ్ సందర్శించాలనుకునేవారికి 'గిన్నీస్ రికార్డ్' మరో ఆహ్వానించదగ్గ కారణమని అంటున్నారు నిర్వాహకులు. పెద్దలకు 50 దిర్హామ్‌లు, పిల్లలకు 20 దిర్హామ్‌లతో దుబాయ్ ఫ్రేమ్‌లోకి ప్రవేశం లభిస్తుంది. 3 ఏళ్ళలోపు చిన్నారులకు, 65 ఏళ్ళు పైబడిన వృద్ధులకు అలాగే పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్కీ ఉచితంగానే ఇందులో ప్రవేశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..