హీరో నాని ముఖ్య అతిథిగా 'ABCD' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- May 12, 2019యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ `యు` సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మే 13న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వస్తున్నారు.
స్టార్ సింగర్ సిద్ శ్రీరాం ఆలపించిన `మెల్లమెల్లగా... ` సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి 25 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోగా.... ట్రైలర్ సినిమాలో ఎంటర్టైనింగ్ పార్ట్‌కు మచ్చుతునకలా కనపడుతుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో జుధా సాంధీ సంగీత సారథ్యంలో పాటల సీడీని ఆవిష్కరించనున్నారు.
నటీనటులు:
అల్లు శిరీష్
రుక్సర్ థిల్లాన్
భరత్
నాగబాబు తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
సంగీతం: జుదా సాందీ
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటర్: నవీన్ నూలి
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం