మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు జపాన్ శ్రీకారం..
- May 12, 2019
టోక్యో:బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జపాన్. ఆదేశంలో బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా పరుగులు తీస్తాయి. తాజాగా మరో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ శ్రీకారం చుట్టనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైలును రూపొందించారు. టెస్టు రన్‌లో అంతా సవ్యంగా సాగితే రవణా రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు వచ్చినట్లే అవుతుంది.
ఆల్ఫా-ఎక్స్ వర్షెన్‌కు చెందిన షిన్‌కాన్‌సేన్ రైలును రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుంటే 2030 నాటికి ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కుతుంది. ప్రవేశ పెట్టిన కొత్తలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీస్తుందని అధికారులు తెలిపారు. చైనాలోని ఇదే ఆల్ఫా ఎక్స్ వర్షెన్ బుల్లెట్ రైలు ఉన్నప్పటికీ జపాన్ రైలుతో పోలిస్తే అది 10 కిలోమీటర్ల వేగం తక్కువ అని అధికారులు తెలిపారు. ఇక జపాన్ ప్రవేశపెట్టనున్న హైస్పీడు రైలుకు 10 బోగీలు ఉంటాయని చెప్పారు. ముందర భాగం చాలా పొడవుగా ఉంటుందని అధికారులు వివరించారు.
ట్రయల్ రన్
సెండాయ్ నుంచి ఆవ్ మోరి వరకు ట్రయల్ రన్
హైస్పీడ్ రైలును సెండాయ్ నుంచి ఆవ్‌మోరి వరకు ప్రయోగాత్మకంగా నడుపుతామని జపాన్ అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 280 కిలోమీటర్లు. అర్థరాత్రి తర్వాత ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుందని ఆ సమయంలో అన్ని పరిశీలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలా వారానికి రెండు సార్లు హైస్పీడ్ రైలును ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీనికంటే ముందు మరో హైస్పీడు రైలు షిన్‌కాన్‌సేన్ ఎన్ 700ఎస్ మోడల్ ట్రైన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా రైలు 2020లో పట్టాలు ఎక్కుతుందని చెప్పారు. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం