కమ్ముకున్న యుద్దమేఘాలు..
- May 12, 2019
ఇరాన్ మీద అమెరికా ఆంక్షలతో పశ్చిమాసియా సముద్ర జలాల్లో యుద్దమేఘాలు కమ్ముకున్నాయి. పశ్చిమాసియాలోని అమెరికన్ సైనిక స్థావరాలు, బలగాలపై ఇరాన్ దాడికి దిగవచ్చన్న నిఘావర్గాల నేపధ్యంలో అమెరికా యుద్దనౌకతో సన్నద్దమైనట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. దీనిలో భాగంగా విమాన వాహక యుద్దనౌక యూఎస్ ఎస్ ఆర్టింగ్టన్ తోపాటు యూఎస్ ఎస్ అబ్రహాం లింకన్ నౌకను సముద్ర జలాల్లో మోహరించింది. పేట్రియాట్ గగనతల క్షిపణీ రక్షణ వ్యవస్థను సైతం ఈ ప్రాంతానికి తరలించింది. ఇరాన్ తో తాము యుద్దాన్ని కోరుకోవడంలేదని, తమ బలగాలను, ప్రయోజనాలను కాపాడుకునేందుకే సిద్దమైనట్లు అమెరికా రక్షణ శాఖ స్పష్టంచేసింది. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. తాము అమెరికాతో యుద్దాన్ని కోరుకోవడంలేదని, కానీ తమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్థిస్తోందని తెలిపింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం