హీరో నాని ముఖ్య అతిథిగా 'ABCD' ప్రీ రిలీజ్ ఫంక్షన్
- May 12, 2019
యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్‌టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశి' ట్యాగ్ లైన్. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు క్లీన్ `యు` సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను మే 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. మే 13న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా వస్తున్నారు.
స్టార్ సింగర్ సిద్ శ్రీరాం ఆలపించిన `మెల్లమెల్లగా... ` సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి 25 మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకోగా.... ట్రైలర్ సినిమాలో ఎంటర్‌టైనింగ్ పార్ట్‌కు మచ్చుతునకలా కనపడుతుంది. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో జుధా సాంధీ సంగీత సారథ్యంలో పాటల సీడీని ఆవిష్కరించనున్నారు.
నటీనటులు:
అల్లు శిరీష్
రుక్సర్ థిల్లాన్
భరత్
నాగబాబు తదితరులు
సాంకేతిక నిపుణులు:
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
సంగీతం: జుదా సాందీ
సినిమాటోగ్రఫీ: రామ్
ఎడిటర్: నవీన్ నూలి
తాజా వార్తలు
- JEE అడ్వాన్స్డ్ 2026 షెడ్యూల్ వచ్చేసింది..
- శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
- తిరుమల మాదిరిగా యాదగిరిగుట్టలో ప్రత్యేక సేవలు
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ మూసివేత..!!
- దుబాయ్ లో జనవరి 1న పార్కింగ్ ఫ్రీ..!!
- బహ్రెయిన్ లో అమల్లోకి కొత్త ఇంధన ధరలు..!!
- అల్-ముబారకియా నుండి చేపల మార్కెట్ తరలింపు..!!
- ఒమన్ లో 12 మంది ఆఫ్రికన్ జాతీయులు అరెస్..!!
- సౌదీ అరేబియాలో అనుమానాస్పద లింక్‌ల ధృవీకరణ సర్వీస్..!!
- తెలంగాణ: నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు..







