అడ్రస్ డౌన్‌టౌన్ లగ్జరీ హోటల్లో మంటలకు గల కారణాలు..
- January 02, 2016
కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా దుబాయ్‌లోని అడ్రస్ డౌన్‌టౌన్ లగ్జరీ హోటల్లో చెలరేగిన మంటలపై ఆ దేశ ప్రభుత్వం విచారణ జరుపుతోంది. 63 అంతస్తుల ఈ భవనంలో గురువారం రాత్రి భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, 30 మందికి స్వల్ప గాయాలయినట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరికి గుండె పోటు వచ్చింది. భవనం 20వ అంతస్తులో లేచిన ఈ మంటలకు గల కారణాలను కనుగొనేందుకు అధికారులు శుక్రవారం ప్రయత్నించారు. అయితే ఇప్పటికీ కచ్చితమైన కారణమేదీ గుర్తించలేకపోయారు. ఇన్వెస్టిగేటివ్ ఫొటోగ్రాఫర్ ఒకరు మంటలు అంటుకుంటున్నప్పుడు తీసిన ఫొటోను దుబాయ్ అత్యున్నత భద్రతా అధికారి జనరల్ దహీ ఖల్ఫాన్ ట్విటర్లో పోస్టు చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









