ఈ నెల 17న ముసుగులు తీస్తాను--సునీల్ కుమార్ రెడ్డి
- May 13, 2019
హైదరాబాద్:కంటెంట్‌వుంటే బడ్జెట్‌తో పనిలేదని టాలీవుడ్‌లో ట్రెండ్ సృష్టించిన పి సునీల్‌కుమార్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం -రొమాంటిక్ క్రిమినల్స్. ఒక రొమాంటిక్ క్రైమ్‌కథ, ఒక క్రిమినల్ ప్రేమకథ చిత్రాలకి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రాన్ని ఎక్కలి రవీందర్‌బాబు, బి బాపిరాజు నిర్మించారు. యువతరాన్ని మత్తువైపు మళ్లిస్తున్న పరిస్థితులు, ఇంటర్నెట్ అశ్లీలతను కంటెంట్ చేసుకుని ఎంటర్‌టైనింగ్‌గా చిత్రాన్ని తెరకెక్కించారు. మనోజ్ నందం ఇంజినీరింగ్ స్టూడెంట్‌గా, సీనియర్ స్టూడెంట్‌గా అవంతిక, డ్రగ్ సెల్లర్‌గా వినయ్, నైన్త్ స్టూడెంట్‌గా వౌనిక, కొత్తగా పెళ్లైన గృహిణిగా దివ్య నటించిన చిత్రం 17న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ 'గతంలో వచ్చిన చిత్రాలకంటే దీని కంటెంట్ కోసం ఎక్కువ రీసెర్చ్ చేశానన్నారు. సమాజంలో ముసుగుచాటున చాలా జరుగుతున్నాయని, వాటిని యూత్‌కి కనెక్టయ్యేలా సినిమా డిజైన్ చేశామన్నారు. మనోజ్ నందం మాట్లాడుతూ సినిమా విడుదల వరకూ ముసుగులు కొనసాగిస్తామని, భిన్నమైన కథని విభిన్నంగా చెబుతున్నామన్నారు. బర్నింగ్ ఇష్యూస్‌ని యూత్‌కి అర్థమయ్యే కోణంలో చూపించామన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ ముసుగు వెనక దాగివున్న రహస్యాలను అవగాహనాత్మకంగా దర్శకుడు చూపించారన్నారు. నిర్మాత రవీంద్రబాబు, బాపిరాజులు మాట్లాడుతూ రొమాంటిక్ క్రిమినల్ చిత్రం తప్పకుండా అందరినీ మెప్పిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్‌లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







