'విద్యారంగంలోకి చిరంజీవి' ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు--స్వామి నాయుడు
- May 13, 2019
మెగాస్టార్ చిరంజీవి విద్యారంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అందులో భాగంగానే ముందుగా శ్రీకాకుళంలో ఓ స్కూల్ కూడా ఓపెన్ చేసారని కొద్ది రోజులుగా పలు సైట్స్‌లో వార్తలు వస్తున్నాయి. సదరు స్కూల్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అధ్యక్షుడిగా, మెగా బ్రదర్ నాగబాబు ఛైర్మన్‌గా, బాధ్యతలు నిర్వర్తించనున్నారని కూడా అన్నారు. కట్ చేస్తే, దీని గురించి శ్రీకాకుళంలోని 'చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్' యాజమాన్యం వివరణ ఇస్తూ, ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
చిరంజీవి ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో స్థాపించే సంస్థతో చిరంజీవికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకి గానీ ఎటువంటి సంబంధం లేదని చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షులు స్వామి నాయుడు తెలియజేసారు. అంతేకానీ, ఈ స్కూల్‌కీ, వారికీ ఎటువంటి సంబంధం లేదు అని వివరణ ఇచ్చారు.

తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







