హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు
- May 14, 2019
హైదరాబాద్: హీరాగోల్డ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్‌ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన కోర్టు 7రోజులు పాటు కస్టడీకి అనుమతించింది. నౌహీరాతో పాటు బిజూ థామస్, మౌళి థామస్‌ను కూడా ఈడీ కస్టడీకి తీసుకోనుంది. 50 వేల కోట్ల రూపాయలు మనీలాండిరింగ్ పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. కాగా ఈ ముగ్గుర్నీ మరి కాసేపట్లో చంచల్ గూడ జైల్ నుంచి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకొని విచారించునున్నారు.
ఇదిలా ఉంటే.. తిరుపతికి చెందిన హీరా గోల్డ్ గ్రూపు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ డిపాజిట్లు చేయించుకుని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ గ్రూపు మోసాలు ఒక్కొక్కటిగా వెలుగుచూశాయి. ఇప్పటికే హీరా గోల్డ్‌లో మనీ లాండరింగ్ జరిగిందని సీసీఎస్ పోలీసులు గుర్తించిన విషయం విదితమే.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..