హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్న వి.వి.వినాయక్
- May 14, 2019వి.వి.వినాయక్.. మాస్ అండ్ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. అదుర్స్‌తో కామెడీని కూడా హ్యాండిల్ చెయ్యగలడని ప్రూవ్ చేసాడు. చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెం:150 తర్వాత సాయి ధరమ్ తేజ్‌తో చేసిన ఇంటిలిజెంట్, వినయ్ కెరీర్‌ని డైలమాలోకి నెట్టేసింది. కట్ చేస్తే, వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకు తెర వెనక యాక్షన్ చెప్పిన ఆయన త్వరలో మరొకరు యాక్షన్ చెప్తే, యాక్ట్ చెయ్యనున్నాడు. సాధారణంగా సీన్ షూట్ చేసేటప్పుడు హీరోలకు తను నటించి చూపిస్తుంటాడు వినాయక్.. చిరంజీవి ఠాగూర్, ఖైదీ నెం:150 సినిమాల్లో కాసేపు తెరపై తళుక్కుమన్నాడు.
ఇప్పుడు పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చెయ్యబోతున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, వినయ్‌ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాతగా తీసిన మొదటి సినిమా దిల్కి డైరెక్టర్ వినాయకే. తనని నిర్మాతగా పరిచయం చేసిన దర్శకుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చెయ్యనున్నాడు దిల్ రాజు. శరభ ఫేమ్ ఎన్. నరసింహరావు ఈ సినిమాని డైరెక్ట్ చెయ్యనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందబోయే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం