ప్రపంచకప్ నేపథ్యంలో ఐసీసీ వినూత్న నిర్ణయం
- May 14, 2019
వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను అవినీతి రహితంగా నిర్వహించేందుకు ఐసీసీ ఓ వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రతి జట్టుకు ఒక అవినీతి నిరోధక అధికారిని నియమించనుంది. ‘సాధన శిబిరాలు, సన్నాహక మ్యాచ్‌లు, అసలైన మ్యాచులు ఆడేటప్పుడు వీరు ఆటగాళ్లను గమనిస్తారు. వారితో కలిసే హోటళ్లో ఉంటారు. వారితో కలిసే ప్రయాణాలు చేస్తారు’ అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు. ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్నవారిపై, అనుమాస్పదంగా కదులుతున్న వారిపై వీరు కన్నేస్తారు. ఏదైనా జరిగే అవకాశం ఉందా అని పరిశీలిస్తారు. మ్యాచ్ ఫిక్సింగ్ జరుగకుండా అవినీతి రహితంగా టోర్నీని నిర్వహించేందుకు ఐసీసీ ఈ చర్య తీసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
- భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!