విశాఖపట్నం లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు కలకలం

- May 15, 2019 , by Maagulf
విశాఖపట్నం లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు కలకలం

విశాఖపట్నం:విశాఖపట్నంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు కలకలం సృష్టించాయి. ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించకోవడంతో బాధితుడు కిడ్నీ మాఫియా గుట్టురట్టయింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టిన కలెక్టర్ కేసు విచారణను వేగవంతం చేయడానికి జిల్లా వైద్యాధికారి తిరుపతి రావు ఆధ్వర్యంలో ఇద్దరు కేజీహెచ్ డాక్టర్లు అర్జున్, నాయక్‌లతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఇప్పటికే తమ విచారణను ముమ్మరం చేసింది. తొలి రోజు విచారణలో తీవ్ర ఆటంకాలు ఎదురైనా.. రెండో రోజు కీలక విషయాలు రాబట్టింది.

కిడ్నీ రాకెట్‌ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. శ్రద్ధ హాస్పిటల్ అడ్మిన్‌ కుమార్‌ వర్మ రెండవ రోజు విచారణలో కీలక విషయాలు బయటికి వచ్చాయి. ఈ హాస్పిటల్‌లో 2016 నుంచి 2019 మధ్య 24 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. ఇందులో 23 కిడ్నీ ఆపరేషన్లకు సంబంధించి ఆధారాలను పోలీసులు సేకరించారు.

బెంగళూరుకు చెందిన ప్రభాకర్‌ కిడ్నీ ఆపరేషన్‌కు సంబంధించిన.. ఫైల్‌ పోయిందని విచారణలో కుమార్‌ వర్మ వెల్లడించారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ కోసం ప్రభాకర్‌ నుంచి 23 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. అటు.. శ్రద్ధ హాస్పిటల్ ఎండీ ప్రదీప్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ప్రదీప్‌ను పట్టుకునేందుకు 5 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com